![]() |
![]() |
టీవీ రంగంలో బిగ్ బాస్ షో ఎంతగా గుర్తింపు తెచ్చుకుంటుందో అందరికి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్-7 ఈ సారి గట్టిగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ షో ఈ సారి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఏ సీజన్ లోను వరుసగా నలుగురు అమ్మాయిలు బయటకు రాలేదు. కానీ ఈ సీజన్-7 లో ఇది జరిగింది. ప్రస్తుతం ఈ షో ఉల్టా పల్టా థీమ్ తో అదరగొడుతుంది.
మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీల, మూడవ వారం దామిణి, నాల్గవ వారం రతిక ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ చరిత్రలో ఇలా అవ్వడం ఇదే మొదటిసారి. ఎందుకంటే హౌజ్ లో అమ్మాయిలు, అబ్బాయిలు సమానంగా ఉండేలా చూసుకుంటారు మేకర్స్. కానీ ఈసారి అనూహ్యంగా నలుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు హౌజ్ లో అమ్మాయిలు ప్రియాంక, శుభశ్రీ, శోభా శెట్టి మాత్రమే ఉన్నారు. అయితే ఈ వారం ఈ షోకి అత్యధిక టీఆర్పీ నమోదైంది. కారణం రతిక అలియాస్ రాధిక. రతిక ఎలిమినేషన్ కోసం బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల అంతా ఏకమయ్యారు. హౌజ్ లోకి టైటిల్ ఫేవరెట్ గా వచ్చిన రతిక.. నెగెటివ్ క్యారెక్టర్ గా పేరు తెచ్చుకుంది. ప్రతీ దానికి ఇన్వాల్వ్ అవడం , హౌజ్ లో ఉన్నన్ని రోజులు పల్లవి ప్రశాంత్, యావర్ లని ప్రేమిస్తున్నట్లుగా నటించి వారికి వెన్నుపోటు పొడవడంతో చాలా నెగెటివ్ అయింది. ఇదే తనకి ఓటింగ్ చాలా తక్కువగా పడేలా చేసింది ఫలితంగా ఓటింగ్ లో చివరి స్థానంలో నిలిచేలా చేసింది.
ఇక నిన్నటి ఎపిసోడ్‌లో నామినేషన్లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేయగా.. చివరి ముగ్గురిలో శుభశ్రీ, టేస్టీ తేజ, రతిక ఉన్నారు. ఇక ముగ్గరికి ఒక పులిని ఇచ్చి ఎవరి దగ్గర ఈ పులి ఉన్నప్పుడు మేక సౌండ్ వస్తుందో వాళ్ళు అన్ సేఫ్ అని పులి సౌండ్ వస్తే సేఫ్ అని నాగార్జున చెప్పగా.. శుభశ్రీ సేఫ్ అయింది. ఇక నామినేషన్లో రతిక, టేస్టి తేజ ఇద్దరే మిగిలారు. ఇద్దరిని సీక్రెట్ రూమ్ లోకి పిలిచి చెరొక గన్ ఇచ్చి నాగార్జున ఫైర్ చేయమనగా.. టేస్టీ తేజ సేఫ్ అని, రతిక యూ ఆర్ ఎలిమినేటెడ్ అని నాగార్జున అనడంతోనే హౌజ్ లోని వారంతా షాక్. టేస్టీ తేజ అయితే.. సర్ నేను సేఫా అని ఆశ్చర్యపోయాడు. ఇక ఆ తర్వాత ఎలిమినేట్ అయి హౌజ్ నుండి స్టేజ్ మీదకి వచ్చిన రతిక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయింది.
![]() |
![]() |